గవర్నర్ తమిళిసైతో నటుడు అలీ భేటీ.. ఎందుకో తెలుసా..?

Actor Ali meets Governor Tamilisai Soundararajan. టాలీవుడ్ సీనియర్ కమెడియన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ.. సడన్‌గా తెలంగాణ

By అంజి  Published on  10 Nov 2022 9:38 AM IST
గవర్నర్ తమిళిసైతో నటుడు అలీ భేటీ.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ కమెడియన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ.. సడన్‌గా తెలంగాణ రాజ్‌భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. దీంతో అలీ తెలంగాణ రాజ్‌భవన్‌కు ఎందుకు వచ్చారని అక్కడున్న వారంతా అనుకున్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. మీడియాతో అలీ మాట్లాడుతూ.. తమ కుమార్తె ఫాతిమా వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు గవర్నర్‌ను కలిశామన్నారు. పెళ్లికి ఆహ్వానించి వివాహ పత్రిక అందజేశామన్నారు. గవర్నర్ తమిళిసై తమతో చక్కగా సంభాషించారని అన్నారు.

తమతో తమిళంలో మాట్లాడిన తర్వాత గవర్నర్ తమిళిసై చాలా సంతోషంగా ఉన్నారని అలీ తెలిపారు. తనను సినిమాల్లో చూసి తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తమిళిసై తనతో చెప్పారని, అది తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. అయితే పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు. అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది.అక్టోబర్‌ 25వ తేదిన హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి పనులు సాంప్రదాయ పద్ధతిలో ఇరుకుటుంబాల సభ్యుల సమక్షంలో దగ్గరుండి నిర్వ హిస్తున్నారు.

Next Story