రోడ్డు పక్కన ప్రసవించిన గర్భిణి.. కనికరించని అచ్చంపేట సీహెచ్‌సీ డాక్టర్‌

Achampet CHC Superintendent, Doctor suspended. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన గర్భిణికి అడ్మిషన్ నిరాకరించినందుకు నాగర్‌కర్నూల్‌ అచ్చంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్‌

By అంజి  Published on  26 Jan 2022 7:55 AM GMT
రోడ్డు పక్కన ప్రసవించిన గర్భిణి.. కనికరించని అచ్చంపేట సీహెచ్‌సీ డాక్టర్‌

కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన గర్భిణికి అడ్మిషన్ నిరాకరించినందుకు నాగర్‌కర్నూల్‌ అచ్చంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణ, డ్యూటీ డాక్టర్‌ హరిబాబులను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ (టీవీవీపీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీవీవీపీ పరిధిలోని సీహెచ్‌సీ ఆస్పత్రిలో అడ్మిషన్‌ నిరాకరించడంతో జనవరి 25న ఆ గర్భిణి ఆస్పత్రి బయట రోడ్డు పక్కనే ప్రసవించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ కృష్ణ, డ్యూటీ డాక్టర్ హరిబాబు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సమగ్ర విచారణ జరిపి నివేదికను వెంటనే కమిషనర్‌ టీవీవీపీకి అందజేయాలని సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పాజిటివ్‌ సోకిన గర్భిణీకి.. విధుల్లో ఉన్న డాక్లర్లు పురుడు పోశారు. గర్భిణీ కరోనా పేషెంట్‌ అని తెలిసినా నిబంధనలు పాటిస్తూ గర్భిణీకి నార్మల్‌ డెలివరీ చేశారు. తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, వారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించామని మండల వైద్యాధికారి తెలిపారు. రంగంపేట గ్రామానికి చెందిన గర్భిణి రజితకు పండంటి మగబడ్డ జన్మించాడు. రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో.. టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

Next Story