Telangana: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. ఏజెంట్ల గుండెల్లో గుబులు

తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సరికొత్త పద్దతిలో రైడ్ కు దిగారు.

By అంజి  Published on  28 May 2024 5:02 PM IST
ACB raids,RTA offices , Telangana

Telangana: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. ఏజెంట్ల గుండెల్లో గుబులు

తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సరికొత్త పద్దతిలో రైడ్ కు దిగారు... సినిమాలలో హీరోలు ఓ అధికారి స్థాయి పోస్టులో ఉన్నప్పుడు కొన్ని కార్యాలయాలపై సాధారణ వ్యక్తిగా రైట్ చేస్తూ ఉండడం చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాం. ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా సినీ పక్కి తరహాలో రవాణా శాఖ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 12 సంవత్సరాల తర్వాత ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాలలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు.

వినూత్న పద్ధతిలో తెలంగాణ ఏసీబీ అధికారులు.. మామూలు వ్యక్తులుగా ఆఫీస్​ లోకి ఎంటర్​ కాగా, అక్కడి పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్​ అయ్యారు. ఇంకా మరోచోట లారీ డ్రైవర్లుగా వేషధారణ మార్చుకుని చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలకు వెళ్లారు. ఇలా ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఉమ్మడి 10 జిల్లాల పరిధిలోని ఆర్టీఏ ఆఫీసులో, చెక్ పోస్ట్ లలో డేకాయ్‌ ఆపరేషన్ నిర్వహించారు. 12 సంవత్సరాల తర్వాత ఏసీబీ అధికారులు సర్ప్రైజ్ రైడ్స్‌ చేయడంతో రవాణా శాఖ కార్యాలయంలోని సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు.

రంగారెడ్డి జిల్లాలోని మణికొండ కార్యాలయంలో మొత్తం 25 మంది అధికారులతో సోదాలు కొనసాగుతున్నాయి. డిసిపి శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంపై రైడ్స్ చేశారు. హైదరాబాద్ వేస్ట్ జోన్ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఒక జూనియర్ అసిస్టెంట్ తో పాటు మరో ముగ్గురిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు కార్యాలయాల్లో విలువైన పత్రాలతో పాటు ఫైల్స్, డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని మలక్‌ పేట, పాతబస్తీ బండ్లగూడ, టోలిచౌకి, నల్గొండ జిల్లాకేంద్రంలో ఉన్న ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేశారు. మహబూబ్‌నగర్‌లోని ఆర్టీఏ ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఐదుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.35వేలు స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న ఏడుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.

మహబూబాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీవో గౌస్‌ పాషా డ్రైవర్‌ సుబ్బారావు వద్ద రూ.16,500 నగదు, రెన్యువల్స్‌, ఫిట్‌నెస్‌ పత్రాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.4,500, నూతన లైసెన్సులు, ఫిట్‌నెస్‌ పత్రాలు గుర్తించారు. కౌంటర్లలోని ఉద్యోగుల వద్ద కూడా లెక్కలు చూపని నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

Next Story