హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట లో బ్యాండ్ బాజా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై గత కొద్ది రోజుల క్రితం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎస్సై శంకర్ కేసు నమోదు చేశాడు.
అయితే కేసు నమోదు అనంతరం సౌండ్ ఎక్విప్ మెంట్స్ ను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సామాగ్రిని తిరిగి ఇచ్చేందుకు గాను కేసు నమోదు కాబడిన వ్యక్తి నుండి ఎస్సై రూ. 15 వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఎస్సై శంకర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు.