కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరి రామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
By అంజి
కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరి రామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే హరే రామ్ నివాసంలో సోదాలు చేసి భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసిబి అధికారులు.. హరి రామ్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసుకొని అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భూక్య హరి రామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండిగా వ్యవహరిస్తున్న సమయంలోనే భారీగా ఆస్తులను కూడ పెట్టుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే మాజీ చీఫ్ ఇంజనీర్ హరీ రామ్ రూ.200 కోట్ల స్థిరాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఒక్క గజ్వేల్ లోనే 30 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవాళ ఎసిబి అధికారులు హరిరామ్‌కుకు చెందిన మూడు బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు. హరి రామ్‌ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించిన ఏసీబీ అధికారులు.. ఇవాళ కస్టడీకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. హరీష్ రావును కస్టడీ లోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావించిన ఏసీబీ అధికారులు నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.