తెలుగు అక్ష‌ర‌మాల‌లో టీఎస్ ఆర్టీసీ గురించి ఇలా

About TS RTC in Telugu Alphabet.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్య‌త‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 May 2022 4:18 AM GMT
తెలుగు అక్ష‌ర‌మాల‌లో టీఎస్ ఆర్టీసీ గురించి ఇలా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి త‌న దైన నిర్ణ‌యాల‌తో సంస్థ‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. న‌ష్టాల్లో ఉన్న సంస్థ‌ను క్ర‌మంగా లాభాల బాట ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సంద‌ర్భం ఏదైనా స‌రే దాన్ని అందిపుచ్చుకుంటూ ఎక్కువ‌ మంది ప్ర‌జ‌లు ఆర్టీసీ బ‌స్సుల‌ను ఎక్కేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు అటు సిబ్బంది, ఇటు ప్ర‌యాణీకుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వాటిని ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు వెలుతున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అందులో వ‌చ్చే ఫిర్యాదుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుంటూ సంస్థ‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచుతున్నారు.

కాగా.. నేడు తెలుగు అక్ష‌ర‌మాల‌ను ఉప‌యోగిస్తూ ఆర్టీసీ చేస్తున్న సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు తెలిసే విధంగా ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అ - అన్ని ర‌కాల ప్ర‌యాణాల‌కు, ఆ - ఆల‌యాల ద‌ర్శ‌న‌ముల‌కు, ఇ - ఇంటి వ‌ర‌కు స‌ర్వీస్ న‌డుపుతూ, ఈ - ఈఎంఐ బాధ‌లు ఉండ‌వు, ఉ - ఉన్న‌తముగా, ఊ - ఊరికి ఊరికి న‌డుపుతూ, బు - బుతువు, ఎ - ఏదైనా, ఏ - ఏడు ర‌కాల స‌ర్వీసులు న‌డుపుతూ, ఒ - ఒకే విధ‌ముగా, ఔ - ఔన‌త్య‌ముగా, అం - అంద‌రి, క - క‌ళ్యాణ‌ల‌కు, ఖ - ఖ‌చ్చ‌త‌మైన వ‌ర్తింపుల‌తో, గ - గ‌మ్యం ఏదైనా, ఘ - ఘ‌న‌ముగా చేర‌వేస్తూ, చ - చిరుజ‌ల్లులో కూడా, ఛా - ఛ‌త్ర‌ముగా, జ - జ‌నాల‌ను చేర‌వేస్తూ, ఝ - ఝాష‌ము వ‌లె, ట - టైం నుంచి టైం వ‌ర‌కు, ఠ - ఠీవిగా న‌డిపిస్తూ, డ - డీల ప‌డ‌కుండా, త - తెలంగాణ మొత్తం, ద - దూరం ఎంతైనా, ధ - ధైర్యంను ఇస్తు, న - న‌ష్టాల్లో ఉన్న‌, ప - ప్ర‌జ‌ల ప్ర‌యాణాలు ఆప‌కుండా, ఫ - ఫ‌లితాలు ఎలా ఉన్నా, బ - బ‌స్సుల‌ను న‌డుపుతోంది. మ - మార్పులు ఎన్నో చేసుకుంటూ, య - య‌దావిధిగా, ర - ర‌వాణాను న‌డిపిస్తూ, ల - ల‌క్ష‌ల మందిని, వ - వారి గ‌మ్య‌ల‌కు, శ - శ‌ర‌వేగంగా చేర‌వేస్తూ, స - స‌మ‌య‌పాల‌న పాటించ‌డం, హ - హ‌క్కుగా న‌డుపుతుంది. క్ష‌- క్షేమంగా అంద‌రినీ చేర‌వేస్తుంది.

న‌ష్టాల్లో ఉన్న స‌రే ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా అన్ని బుతువుల్లో ప్ర‌తి ఊరికి టైం టూ టైమ్‌ బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ల‌క్ష‌ల మందిని గ‌మ్య‌స్థానాల‌కు శ‌ర వేగంగా చేర‌వేస్తోంది. స‌మ‌య‌పాల‌న‌, ప్ర‌యాణీకుల భ‌ద్ర‌తే ల‌క్ష్యంగా ఏడు ర‌కాల స‌ర్వీసుల‌ను తెలంగాణ రాష్ట్రం మొత్తం న‌డుపుతోంది. కాల‌నుగుణంగా ఎన్నో మార్పులు చేసుకుంటూ ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది టీఎస్ ఆర్టీసీ.

Next Story
Share it