తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌ ఎవరో తెలుసా?

టీజీఆర్టీసీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా ఓ మహిళ శనివారం విధుల్లో చేరారు

By Knakam Karthik
Published on : 15 Jun 2025 11:04 AM IST

Telangana, Tgrtc, Women Driver Saritha, Minister Ponnam Prabhakar

తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌ ఎవరో తెలుసా?

తెలంగాణ ఆర్టీసీలో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. టీజీఆర్టీసీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా ఓ మహిళ శనివారం విధుల్లో చేరారు. మొదటి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపారు...వివరాల్లోకి వెళితే..యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత ఆర్టీసీలో బస్ డ్రైవర్‌గా శనివారం విధుల్లోకి చేరారు. ఇన్నిరోజులు దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించిన ఆమె..తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్‌గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. వారు స్పందించి ఆర్టీసీ డ్రైవర్‌గా ఆమెకు అవకాశం కల్పించారు. తనకు అవకాశం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కి మహిళా డ్రైవర్ సరిత ధన్యవాదాలు తెలిపారు.

ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని ఇప్పటికే మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు, తాజాగా ఆర్టీసీలో మహిళా డ్రైవర్‌గా అవకాశం ఇవ్వడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా డ్రైవర్ వి.సరిత ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story