తుప్రాన్‌లో కూలిన శిక్షణా విమానం.. వీడియో

మెదక్‌ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది.

By అంజి  Published on  4 Dec 2023 9:51 AM IST
Training Plane Crashed, Tupran,Medak District

తుప్రాన్‌లో కూలిన శిక్షణా విమానం

మెదక్‌ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన శిక్షణ విమానం కూలింది. సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలినట్టు సమాచారం. విమానం కూలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రస్తుతం శిక్షణ విమానం పూర్తిగా కాలిపోయింది. ఉదయం 8గంటల సమయంలో పెద్ద శబ్దంతో విమానం కూలిపోవడాన్ని స్థానికులు గుర్తించారు. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా మంటల్లో దగ్ధమవుతున్న విమానం కనిపించింది. వెంటనే వారు విమానం కుప్పకూలిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. కూలిన విమానంలో ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్లు తప్పించుకున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Next Story