ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. ఓఆర్‌ఆర్‌ దగ్గర ఘటన

హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

By అంజి
Published on : 7 July 2023 8:40 AM IST

bus catches fire, Telangana, Pedda Amberpet, TSRTC

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. ఓఆర్‌ఆర్‌ దగ్గర ఘటన

హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న టీఎస్‌ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్‌ నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులోని ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్‌ అప్రమత్తతో బస్సులోని ప్రయాణికులంతా కిందకి దిగేశారు. డ్రైవరర్‌ చాకచక్యంగా వ్యహారించడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆ వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మొదట ఏసీలో మంటలు చెలరేగినట్లు ఫైర్‌ సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story