రేపిస్టులకు బెయిల్ రాకుండా చట్టాన్ని తయారు చేయాలి: కేటీఆర్‌

A law should be made to prevent rapists from getting bail.. Says Minister KTR. గుజరాత్‌లోని బిల్కిస్‌ బానో కేసులో 11 మంది అత్యాచారం, హత్య ఖైదీలను విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

By అంజి  Published on  19 Aug 2022 9:34 AM GMT
రేపిస్టులకు బెయిల్ రాకుండా చట్టాన్ని తయారు చేయాలి: కేటీఆర్‌

గుజరాత్‌లోని బిల్కిస్‌ బానో కేసులో 11 మంది అత్యాచారం, హత్య ఖైదీలను విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ఇటీవల తెలంగాణ సర్కార్‌పై నెట్టింట ట్రోలింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. జూబ్లీహిల్స్‌ ఘటన కేసులో నిందితులను చాలా వేగంగా అరెస్ట్‌ చేశామని చెప్పారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు జైలుకు కూడా పంపారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

అయితే అరెస్ట్‌ అయిన 45 రోజుల తర్వాత హైకోర్టు.. ఆ నిందితులను బెయిల్‌ మంజూరు చేసిందని కేటీఆర్‌ వెల్లడించారు. చట్ట ప్రకారం నిందితులకు శిక్షపడే వరకు తమ సర్కార్‌ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ క్రమంటోనే ట్విటర్‌ వేదికగా.. జువైనెల్‌ చ‌ట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. అందుకే నిందితులకు బెయిల్ ఇవ్వ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని తాను డిమాండ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్య‌క్తి తుదిశ్వాస విడిచే వ‌ర‌కు జైలులో ఉండాల‌న్నారు.

జీవిత ఖైదు శిక్ష‌ను నిజ‌మైన రీతిలో అమ‌లు చేయాల‌ని మంత్రి త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. జువైనెల్ జస్టిస్‌ యాక్ట్‌, ఐపీపీ, సీఆర్‌పీసీలోని లొసుగుల కారణంగదా జూబ్లీహిల్స్‌ కేసులో రేపిస్టులు బెయిల్‌పై విడుదల అయ్యారని తెలిపారు. అంతకుముందు.. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది వ్యక్తులను ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేయడాన్ని కేటీఆర్‌ తప్పుపట్టారు. ఖైదీలకు మిఠాయిలు, పూలదండలతో స్వాగతం పలకడంపై ప్రత్యేకంగా స్పందిస్తూ 'ఇది మన దేశ సామూహిక మనస్సాక్షికి మాయని మచ్చ' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. "ఈ రోజు బిల్కిస్ బానోకి జరిగినది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చు" అని ఆయన రాశారు.

దాదాపు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసిన కేసు విషయానికొస్తే, ఆరుగురిలో ఐదుగురు నిందితులు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, అంటే వారికి తక్కువ కఠినమైన చట్టాలు వర్తిస్తాయి. గత నెలలో వీరికి బెయిల్ వచ్చింది. మైనర్ కానీ సాదుద్దీన్ మాలిక్ 61 రోజుల జైలు శిక్ష తర్వాత ఆగస్టులో బెయిల్ పొందాడు. పోలీసు విచారణ ముగిసి, ఛార్జిషీట్ కూడా దాఖలు చేసినందున మాలిక్ బెయిల్ పొందేందుకు అర్హుడని అతని తరపు న్యాయవాది వాదించారు.

Next Story