తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నుండి మత్తయ్యను తప్పిస్తూ తీర్పు చెప్పింది. 2015లో జరిగిన ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏ 1 కాగా మత్తయ్య ఏ4 గా ఉన్నారు. 2016లో ఆయనను తప్పిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిని అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఈ నెల 22న తుది వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది.
ఈ కేసు 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది. అప్పటి టీడీపీ నాయకులు ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్)ను తమ అభ్యర్థికి ఓటు వేయడానికి డబ్బు ఆశ చూపారని ఆరోపణలు ఉన్నాయి. జెరూసలేం మత్తయ్య... టీడీపీ నాయకులకు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఇటీవలే మత్తయ్య కోర్టుకు లేఖ రాశారు. ముత్తయ్యను కేసు నుంచి విముక్తి చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.