బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది.

By అంజి  Published on  3 July 2024 11:00 AM IST
criminal case,BRS MLA, Padi Kaushik Reddy, Huzurabad

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. భారత్ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) చట్టంలో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్తున్న సమయంలో ఆమెకు అడ్డుగా బైఠాయించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ క్రమంలోనే కలెక్టర్‌ విధులకు ఆటంకం కలిగించారంటూ భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు అయింది.

బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది. నిన్న కరీంనగర్ జిల్లా జడ్పీ సమావేశంలో కౌశిక్ రెడ్డి విశ్వరూపం చూపించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో విద్యారంగానికి సంబంధించి నెలకున్న సమస్యలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అయితే ఈ రివ్యూ మీటింగ్‌కు హాజరైన MEOలను..డీఈఓ ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీంతో ఆ డీఈఓను వెంటనే సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ను పట్టుబట్టారు..కౌశిక్‌రెడ్డి.

ఈ అంశంపై సమాధానం ఇవ్వాలంటూ సమావేశ మందిరంలోనే ఆందోళనకు దిగారు. డీఈఓను సస్పెండ్ చేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా ఎడ్యుకేషన్ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించే అర్హత తమకు లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జడ్పిటిసి రవీంద్రర్ ను ఉద్దేశించి ''నీ సంగతి చెప్తా అమ్ముడు పోయిన నువ్వు మాట్లాడతావా? సిగ్గుపడాలి'' అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు.

Next Story