40 వేల నాణేలతో చిత్రం వేసి.. కేటీఆర్‌కు స్పెషల్‌ బర్త్‌ డే విషెస్‌

A 30 feet image of ktr was made with coins on the floor in ravindra bharati. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆయనకు

By అంజి  Published on  24 July 2022 2:39 PM IST
40 వేల నాణేలతో చిత్రం వేసి.. కేటీఆర్‌కు స్పెషల్‌ బర్త్‌ డే విషెస్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆయనకు బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు. మరికొందరు వినూత్న రితీలో కేటీఆర్‌కు బర్త్‌ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. నేలపై కాయిన్స్‌తో కేటీఆర్‌ చిత్రాన్ని వేయించి ఓ అభిమాని తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరోవైపు రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు పలువురు నేతలు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా.. కామారెడ్డికి చెందిన కేటీఆర్ అభిమాని, సెన్సార్ బోర్డు మెంబర్‌ అతిమాముల రామకృష్ణ రవీంద్ర భారతిలో నేలపై కాయిన్స్‌తో 30 అడుగుల కేటీఆర్‌ చిత్రాన్ని వేయించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత భారీ రంగోలీ చిత్రకారుడు విజయ్‌ భాస్కర్‌తో ఈ కళాఖండాన్ని వేయించారు. ఈ చిత్రం ఏర్పాటు చేయడానికి 40 వేల నాణేలను ఉపయోగించారు. 20 గంటలకుపై కళాకారులు శ్రమించి ఈ చిత్రాన్నివేశారు. రవీంద్ర భారతి ఘంటసాల ప్రాంగణంలో వేసిన ఈ చిత్రం వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు.



Next Story