తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

993 New corona cases reported in Telangana.తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2021 3:00 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 993 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,21,606కి చేరింది. నిన్న ఒక్క రోజే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,644కి పెరిగింది. నిన్న 1,417 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,04,093కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 124 కేసులు న‌మోదు కాగా.. న‌ల్లొండ‌లో 78, సూర్యాపేట‌లో 72, మంచిర్యాల‌లో 59, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 58, ఖ‌మ్మంలో 50 కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story