హైదరాబాద్: మనిషి జీవితాంతం నేర్చుకుంటూ, ఎదుగుతూనే ఉంటాడని చదవడానికి, నేర్చుకునేందుకు వయసు అడ్డంకి కానే కాదని మరో సారి నిరూపితమైంది. 93 ఏళ్ల రేవతి తంగవేలు విషయంలో ఇది నిజమైంది. ఆమెకు ఆంగ్లంలో PhD చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ 83వ కాన్వకేషన్‌లో ఆమె డిగ్రీ అందుకున్నారు. రేవతి తంగవేలు 1990లో లెక్చరర్‌గా పదవీ విరమణ చేశారు. ఆమె ఇక్కడితో ఆగకుండా తన చదువును కొనసాగిస్తూ ఆంగ్లంలో పీహెచ్‌డీ చేయాలని భావించింది. ప్రస్తుతం ఆమె సికింద్రాబాద్‌లోని కీస్ ఎడ్యుకేషనల్ సొసైటీలో పనిచేస్తున్నారు. ఆంగ్ల భాషలో వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపై రేవతి తంగవేలు పరిశోధనలు చేశారు.
ఆమె చేసిన పరిశోధనలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ పట్టాను అందజేశారు. ఈ వయసులో బామ్మ పీహెచ్‌డీ పట్టా సాధించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు. దీనికి స్పెషల్ గెస్ట్‌గా హాజరైన శంతను నారాయణ్‌కు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఇదిలా ఉంటే.. యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా 1,024 మంది ప్రముఖులు పీహెచ్‌డీ పట్టాలు పొందారు. ఓయూ పరిధిలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 58 మందికి బంగారు పతకాలు అందించారు.