తెలంగాణ క‌రోనా బులిటెన్.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

858 New Corona cases reported in Telangana.తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 8:15 PM IST
తెలంగాణ క‌రోనా బులిటెన్.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 858 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,237కి చేరిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. నిన్న ఒక్క రోజే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,678కి పెరిగింది. నిన్న 1,175 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,08,833కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 12,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా క‌రోనా పాజిటివ్ కేసులు..

ఆదిలాబాద్‌-2, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-30, జీహెచ్ఎంసీ-107, జ‌గిత్యాల‌-18, జ‌న‌గాం-09, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-16, జోగులాంబ గ‌ద్వాల‌-5, కామారెడ్డి-3, క‌రీంన‌గ‌ర్‌-51, ఖ‌మ్మం-81, కొమురంభీం ఆసిఫాబాద్‌-4, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-18, మ‌హ‌బూబాబాద్‌-40, మంచిర్యాల‌-41, మెద‌క్‌-7, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి-39, ములుగు-18, నాగ‌ర్‌క‌ర్నూలు-12, న‌ల్ల‌గొండ‌-64, నారాయ‌ణ‌పేట‌-4, నిర్మ‌ల్‌-2, నిజామాబాద్‌-6, పెద్ద‌ప‌ల్లి-36, రాజ‌న్న సిరిసిల్ల‌-22, రంగారెడ్డి-51, సంగారెడ్డి-12, సిద్దిపేట‌-23, సూర్యాపేట‌-52, వికారాబాద్‌-10, వ‌న‌ప‌ర్తి-7, వ‌రంగ‌ల్ రూర‌ల్‌-14, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌-39, యాదాద్రి భువ‌న‌గిరి-15.


Next Story