తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,08,954 శాంపిళ్లను పరీక్షించగా..848 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,26,085కి చేరింది. నిన్న ఒక్క రోజే 06 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,684కి పెరిగింది. నిన్న 1,114 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,09,947కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,454 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.42 శాతంగా ఉంది.