Nalgonda: ఒకే గ్రామంలో 60 కుక్కలు మృతి.. అసలేమైందంటే?
తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరీపై దాడి చేస్తున్నాయి.
By అంజి Published on 10 July 2023 7:59 AM GMTNalgonda: ఒకే గ్రామంలో 60 కుక్కలు మృతి.. అసలేమైందంటే?
తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరిపై దాడి చేసి విచక్షణారహితంగా గాయపరుస్తున్నాయి. హైదరాబాదులోని అంబర్పేట్ లో కుక్కల దాడిలో ఓ చిన్నారి బాలుడు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ విధంగా ఒంటరిగా వెళుతున్న అందరిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. నల్గొండ జిల్లాలో కూడా వీధి కుక్కలు రోజురోజుకీ రెచ్చిపోయి మనుషులను గాయపరచడమే కాకుండా మూగజీవులైన మేకలు గొర్రెలు, దూడలపై విచక్ష ణారహితంగా దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. అందరూ కలిసి వీధి కుక్కలను చంపేందుకు ప్లాన్ వేశారు.
ఇందు కొరకు కొందరు వ్యక్తులు పథకం కూడా రచించారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 60 కుక్కలకు విషం పెట్టి చంపేశారు. అయితే కుక్కలు చంపుతున్నారన్న విషయం బయటికి రావడంతో గ్రామస్తులందరూ భయపడి వెంటనే కుక్కలను చంపే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఈ దారుణమైన సంఘటన నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలంలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలోని ఆరూర్ గ్రామంలోని మత్స్యగిరిగుట్ట సమీపంలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తూ అందరిపై దాడి చేయడమే కాకుండా మూగజీవులపై కూడా దాడి చేస్తూ ఉండడంతో గ్రామస్తులందరూ వీధి కుక్కల బెడద భరించలేకపోయారు.
రోజురోజుకు రెచ్చిపోతూ వ్యవసాయ పొలాల్లో ఉండే లేగ దూడలను, మేకలను, గొర్రె పిల్లలను, చిన్నపిల్లలను గాయపరుస్తూ ఉండడంతో గ్రామస్తులు విసిగిపోయారు. దీంతో వీధి కుక్కలకు విషం పెట్టి చంపాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు కలిసి అన్నంలో విషం కలిపి వీధి కుక్కలకు ప్రేమగా పెట్టారు. కుక్కలు మరణించిన అనంతరం వాటన్నిటిని ట్రాక్టర్లో పడేసి గ్రామ శివారుకు తరలించి గొయ్యి తీసి పాతిపెట్టిన సంఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఆ గ్రామంలో పలు కుక్కలు మృతి చెందాయన్న విషయం వెలుగులోకి రావడంతో వెంటనే గ్రామస్తులు మిగతా కుక్కల్ని చంపాలన్న తమ నిర్ణయాన్ని విరమించుకున్నారు.