రంగారెడ్డి జిల్లా రాజేంద్రగనర్ శివరాంపల్లిలో విషాద ఘటన వెలుగు చూసింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో హైటెన్షన్ వైర్ తగిలి ఓ విద్యార్థి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా కరెంట్ వైర్ తగిలి షాక్ రావడంతో ఐదవ తరగతి విద్యార్థి మహ్మద్ ఉమర్ కుప్ప కూలిపోయాడె. వెంటనే తోటి విద్యార్థులు అక్కడికి పరుగులు తీసి అతడిని కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మాదం.
అగంట పాటు గ్రౌండ్‌లోనే కరెంట్ షాక్‌తో విద్యార్థి కొట్టు మిట్టాడు. స్కూల్ యాజమాన్యం అతడికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ ఘటనలో విద్యార్థి చేతులు, కాళ్లకు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. అరగంట తరువాత విద్యార్థిని హుటాహుటిన 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం చెరవేసింది.
వెంటనే ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు.. తమ కుమారుడికి అయిన కాలిన గాయాలు చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. స్కూల్ యాజమాన్యం, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకుకు ఈ పరిస్థితి పట్టిందని ఆరోపించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.