తెలంగాణకు ఐదు ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డులు.. దేశంలోనే ఫస్ట్‌టైం.!

ఐదు తెలంగాణ ప్రభుత్వ ఆస్తులకు 'అందమైన భవనాల కోసం అందించే ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డులు' లభించాయి. ఈ భవనాలను లండన్‌కు

By అంజి  Published on  15 Jun 2023 9:10 AM IST
International Green Apple awards , Telangana buildings, Yadadri Temple, KCR

తెలంగాణకు ఐదు ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డులు.. దేశంలోనే ఫస్ట్‌టైం.!

తెలంగాణ: ఐదు తెలంగాణ ప్రభుత్వ ఆస్తులకు 'అందమైన భవనాల కోసం అందించే ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డులు' లభించాయి. ఈ భవనాలను లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ అర్బన్ మరియు రియల్ ఎస్టేట్ సెక్టార్ కేటగిరీ కింద ఎంపిక చేసింది. జూన్ 16న లండన్‌లో జరగనున్న ఈ అవార్డు ప్రదానోత్సవానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హాజరుకానున్నారు.

అవార్డుల లిస్ట్‌ ఇదే:

1. మోజామ్-జాహీ మార్కెట్ (హెరిటేజ్ విభాగంలో - అద్భుతమైన పునరుద్ధరణ, పునర్వినియోగం కోసం)

2. దుర్గం చెరువు కేబుల్ వంతెన (ప్రత్యేకమైన డిజైన్ కోసం వంతెన విభాగంలో)

3. బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం (సౌందర్యపరంగా రూపొందించబడిన కార్యాలయం/కార్యస్థల భవనం విభాగంలో)

4. తెలంగాణ పోలీసుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ప్రత్యేకమైన ఆఫీస్ విభాగంలో)

5. యాదాద్రి ఆలయం (లక్ష్మీ నరసింహ స్వామి నివాసం (అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో)

భారతదేశం నుండి ఏదైనా భవనాలు/నిర్మాణాలు ప్రతిష్టాత్మకమైన గ్రీన్ యాపిల్ అవార్డులను పొందడం ఇదే మొదటిసారి. మొత్తం ఐదు అవార్డులను అందుకున్న ఘనత తెలంగాణకు దక్కింది. అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

లండన్‌లో 1994లో స్థాపించబడిన గ్రీన్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉత్తమ పద్ధతులను గుర్తించడం, రివార్డ్ చేయడం, ప్రోత్సహించడం కోసం అంకితం చేయబడిన ఒక స్వతంత్ర లాభాపేక్షలేని సంస్థ.

Next Story