తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 55,538 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. నిన్న ఒక్క రోజే 35 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,739కి పెరిగింది.
నిన్న 7,646 కరోనా కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,28,865కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 65,757 ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 86.22 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.55శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలో 851 నమోదు కాగా.. ఆ తరువాత మేడ్చల్ మల్కాజిగిరిలో 384, మహబూబ్ నగర్‌లో 208 కేసులు నమోదు అయ్యాయి.