బీఆర్ఎస్ బహిరంగ సభ.. అతిథుల కోసం నోరూరించే వంటకాలు..!
38 Variety Telangana Dishes for Guests who are coming for Khammam BRS public meeting.బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు సర్వం
By తోట వంశీ కుమార్ Published on 18 Jan 2023 2:45 AM GMTభారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తొలి బహిరంగ సభకు సర్వం సిద్దమైంది. ఈ సభకు ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాలతో మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ జాతీయ ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేదికపై నుంచి వెల్లడించే అవకాశం ఉంది. ఆరు రాష్ట్రాల పార్టీ శాఖలు, రైతు విభాగాలను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్‌తో పాటు సమాజ్‌వాజ్ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులు వస్తుండడంతో రాజకీయ కోలాహలం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ముగ్గురు సీఎంలు వస్తుండడంతో వారికి తెలంగాణ సంప్రదాయ రుచులు చూపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఐటమ్స్‌ను సిద్దం చేయిస్తున్నారు. 38 రకాల వంటకాలతో కూడిన మెనూను సిద్ధం చేశారు. ఇందులో 17 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కాగా 21 రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయి.
మెనూ ఇదే..
మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కొరమీను కూర, తెలంగాణ స్టైల్ మటన్ కూర, తలకాయ ఇగురు, నాటుకోడి కూర, బొమ్మిడాయల పులుసు, బోటీ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై, పనీర్ బటర్, మసాలా, మెతీ చమన్, దాల్ తడ్కా, బచ్చలకూర, మామిడికాయ పప్పు, బీరకాయ శనగపప్పు, బెండకాయ కాజు ఫ్రై, ముద్దపప్పు, తెలంగాణ ఫేమస్ పచ్చిపులుసు, ఇంకా రకారకాల స్వీట్లు, హాట్ ఐటమ్స్, పలు మిక్సింగ్ ఐటమ్స్ ఉన్నాయి. 500 మంది అతిథుల కోసం ఈ మెనూను సిద్ధం చేశారు.