తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By -  Knakam Karthik
Published on : 21 Nov 2025 5:08 PM IST

Telangana, 32 IPS officers , Transfers, Telangana Police, IPS Transfers

తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీలలో భాగంగా పోలీసు శాఖలోని ప్రధాన విభాగాలకు కొత్త సారథులను నియమించింది. ఈ మార్పుల్లో భాగంగా జయేంద్రసింగ్ చౌహాన్‌ను అదనపు డీజీగా నియమించగా, పరిమళ హన నూతన్ జాకబ్‌కు సీఐడీ డీజీ బాధ్యతలు అప్పగించారు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్ మైలబత్తుల నియామకం జరిగింది. మహేశ్వరం జోన్ డీసీపీగా కే నారాయణ రెడ్డి, టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ పద్మజను పోస్టింగ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్పీగా సంగ్రామ్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ప్రభాకర్‌ను నియమించగా, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్‌ను మార్చారు.

కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితను ఎంపిక చేశారు. అలాగే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో మరో ఎస్పీగా గిరిధర్‌ను నియమించారు. వికారాబాద్ ఎస్పీ పదవి స్నేహా మిశ్రాకు దక్కింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభవ్‌ను నియమించారు. ములుగు జిల్లా ఎస్పీగా కేకేఎన్ సుధీర్ రామ్‌నాథ్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సంకీర్త్ కొత్త బాధ్యతలు తీసుకోనున్నారు. గవర్నర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌ను నియమించారు. పెద్దపల్లి డీసీపీగా రామ్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. మల్కాజ్‌గిరి డీసీపీగా సీహెచ్. శ్రీధర్‌ను నియమించారు.

భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీగా అవినాష్ కుమార్, భువనగిరి అడిషనల్ ఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి, జగిత్యాల అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి పనిచేయనున్నారు. ములుగు అడిషనల్ ఎస్పీగా శివం ఉపాధ్యాయ నియమితులయ్యారు. అదిలాబాద్‌లో అదనపు ఎస్పీగా మౌనికా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏటూరు నాగారం ఏఎస్పీగా మనన్ భట్, నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, వేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయికి పోస్టింగులు జారీ అయ్యాయి. సత్తుపల్లి ఏసీపీగా యాదవ్ వసుంధరను నియమించారు. టీఎస్ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, వనపర్తి ఎస్పీగా సునీత కొత్తగా నియమితులయ్యారు.

Next Story