మేడ్చల్‌లో 210 కిలోల గంజాయి పట్టివేత

మేడ్చల్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. సోమవారం ఎస్‌వోటి శంషాబాద్, మేడ్చల్ పోలీసులు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్

By అంజి  Published on  26 Jun 2023 10:56 AM GMT
Ganja, Medchal, Crime news, Carden Search

మేడ్చల్‌లో 210 కిలోల గంజాయి పట్టివేత 

మేడ్చల్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. సోమవారం ఎస్‌వోటి శంషాబాద్, మేడ్చల్ పోలీసులు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. ఆ సమయంలో కారులో తరలిస్తున్న 210 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. గంజాయి విలువ మార్కెట్‌లో దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని బెర్హంపూర్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు దీన్ని తరలిస్తున్నారని విచారణలో కనుగొన్నారు.

పొడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కియా కార్, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న తిరుపతి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా సీతా రామ్ ఉండగా.. ఏ2 గా మాతృ నాయక్, ఏ3గా శివ ఉన్నారు. తిరుపతి ఏ4గా ఉన్నారు. సీతా రామం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కొంత కాలం నుండి మాతృ నాయక్, శివలతో కలిసి సులభంగా డబ్బు సంపాదించడానికి ఒరిస్సా రాష్ట్రం బెర్హంపూర్ గ్రామం నుండి మహారాష్ట్ర రాష్ట్రానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. తిరుపతి అక్రమంగా గంజాయిని తరలిస్తూ వస్తున్నాడు.

శివ మహారాష్ట్రలో అక్రమ నిషేధిత గంజాయిని స్వీకరించి వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తాడు. సీతా రామ్ బెర్హంపూర్ ఏజెన్సీ ప్రాంతం చుట్టూ ఉన్న స్థానిక గంజాయి సాగుదారుల వద్ద గంజాయిని సేకరించి, వివిధ రాష్ట్రాల్లోని గంజాయి విక్రేతలకు సరఫరా చేస్తుంటారు. మాతృ నాయక్ సూచనలను అనుసరిస్తూ ఒరిస్సా రాష్ట్రంలోని బెర్హంపూర్ గ్రామం నుండి మహారాష్ట్రకి కియా కారులో గంజాయిని రవాణా చేస్తూ ఉండగా హైదరాబాద్ పోలీసులు మేడ్చల్ లో కారును పట్టుకున్నారు. 3000 రూపాయలకు కేజీ గంజాయిని కొనుక్కుని 20000 వరకూ అమ్ముతున్నారని పోలీసుల విచారణలో తేలింది.

Next Story