తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. రెండు వేలు దాటిన కరోనా కేసులు

2055 New corona cases in telangana.తెలంగాణ రాష్ట్రంలో 87,332 మందికి క‌రోనా నిర్థార‌ణ పరీక్ష‌లు చేయ‌గా.. కొత్త‌గా 2,055 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 5:12 AM GMT
telangana corona cases

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు వెయ్యిలోపే న‌మోదు అయిన కేసులు నేడు 2వేలు దాటాయి. తాజాగా ప్ర‌భుత్వం క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్ర‌కారం 87,332 మందికి క‌రోనా నిర్థార‌ణ పరీక్ష‌లు చేయ‌గా.. కొత్త‌గా 2,055 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసుల సంఖ్య 3,18,704 కి చేరింది. నిన్న క‌రోనా ఏడుగురు మృత్యువాత ప‌డ్డారు.

దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,741కి చేరింది. నిన్న ఒక్క రోజే 303 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13,362 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీరిలో 8,263 మంది హోం ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 398, మేడ్చల్‌ జిల్లాలో 214, రంగారెడ్డిలో 174, నిజామాబాద్‌లో 169 చొప్పున ఉన్నాయి.


Next Story
Share it