2024 నా జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరం : టీపీసీసీ చీఫ్‌

తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

By Medi Samrat
Published on : 31 Dec 2024 3:33 PM IST

2024 నా జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరం : టీపీసీసీ చీఫ్‌

తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరం నా రాజకీయ జీవితంలో కీలకమైనది. మరవలేది.. ఈ ఏడాది అది నాయకులు, తోటి రాజకీయ మిత్రులు, స్నేహితులు, మీడియా ప్రోత్సహం నాకు జీవితాంతం గుర్తుంటుందన్నారు. గత ఏడాదిలో ఎన్నో విజయాలు, ఎన్నో అనుభవాలు సాధించామన్నారు.

2024 నా జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరం.. ఒక రాజకీయ నాయకుడిగా చట్ట సభలో అడుగుపెట్టినా.. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా గొప్ప పీసీసీ పదవిలో రాష్ట్ర అధ్యక్షుడిగా అడుగు వేసినా.. ఇది నా జీవితంలో అత్యంత గొప్ప సంఘటన అని పేర్కొన్నారు.

నాకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించిన ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు, నాకు రాజకీయ తోడ్పాటు అందించిన రాష్ట్ర నాయకుల సహకారాన్ని ఎన్నటికి మరువలేను అన్నారు. వచ్చే కొత్త సంవత్సరం తెలంగాణ ప్రజలకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు వచ్చే కొత్త సంవత్సరంలో విజయాలు సాధించాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాన‌ని మహేష్ కుమార్ గౌడ్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Next Story