తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న 40,444 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 168 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కరోనా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,254కి చేరింది. నిన్న 163 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు 2,95,707 మంది కోలుకున్నారు. కొత్తగా ఒక్క మరణం కూడా నమోదవలేదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 1635 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో 1912 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 796 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 29 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉన్నదని తెలిపింది. కాగా.. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 88,01,651కి చేరింది.