కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది విద్యార్థినులకు తీవ్రగాయాలు

15 nursing students injured in road accident in Nalgonda. తెలంగాణలోని నల్గొండ జిల్లా నక్రేకల్ వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో కళాశాల

By అంజి  Published on  12 Dec 2022 5:54 AM GMT
కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది విద్యార్థినులకు తీవ్రగాయాలు

తెలంగాణలోని నల్గొండ జిల్లా నక్రేకల్ వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 9.30 గంటలకు పీజీఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు కళాశాల బస్సులో సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్రేకల్‌ వద్ద తాటికల్‌ ఫ్లైఓవర్‌ సమీపంలో అతివేగంతో వచ్చిన లారీ కళాశాల బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో కాలేజీ బస్సు బోల్తా పడింది. గాయపడిన విద్యార్థులను నక్రేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలా మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదిలా ఉంటే.. పాఠశాల బస్సు బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన రాయ్‌ఘడ్‌ జిల్లాలోని కోపోలి సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ముంబైలోని చెంబూర్‌లో గల ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు టూర్‌ కోసం లోనావాలా ప్రాంతానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ముంబై-పుణె హైవేపై రాత్రి 8 గంటల ప్రాంతంలో కొండలు దిగుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story