హైదరాబాద్: మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా ఆయనపై ఉపా చట్టం కింద ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఇటీవల మరణించిన మావోయిస్టు నాయకుడు రామచంద్ర రెడ్డి అంత్యక్రియల సందర్భంగా మావోయిస్టు ఉద్యమానికి మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. జనగాం జిల్లాలోని జఫర్‌ఘడ్ మండలంలో అనాథ శరణాలయం నిర్వహిస్తున్న ఇన్నయ్యను నలుగురు NIA అధికారులు అధికారిక వాహనాల్లో అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ జాఫర్గఢ్‌లోని తన ఇంటి వద్ద పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారెడ్డిపై UAPA చట్టం కింద కేసులు నమోదయ్యాయి. నిషేదిత మావోయిస్ట్ పార్టీకి మద్దతు తెలిపారని అధికారులు పేర్కొన్నారు. ఇక ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ కూడా ఇన్నా రెడ్డి ఆరోపణలు చేశారు.