తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు.. కొత్తగా ఎన్నికేసులంటే..?
1321 New corona cases in Telangana.తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 62,973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,321 కరోనా పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on
4 April 2021 4:25 AM GMT

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 62,973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,12,140కి చేరింది. నిన్న ఒక్క రోజే ఐదుగురు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,717 చేరింది. నిన్న ఒక్క రోజే 293 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,02,500కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,886 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 320 కేసులు నమోదు అయ్యాయి.
Next Story