తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,19,537శాంపిళ్లను పరీక్షించగా 1197 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,14,399కి చేరింది. నిన్న ఒక్క రోజే 09 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,576కి పెరిగింది. నిన్న 1,709 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,93,577కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 137 కేసులు నమోదు కాగా.. నల్లొండలో 84, సూర్యాపేటలో 72, భద్రాద్రి కొత్తగూడెంలో 71 కేసులు నమోదుఅయ్యాయి.