తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు రెడీ అయ్యింది. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. త్వరలో 11 వేల అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. 15 వేల అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్‌గా చేస్తామని చెప్పారు. దీని కోసం అంగన్వాడీ కార్యకర్తలకు ఇంగ్లీష్‌లో బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.
ఈ ప్లే స్కూళ్లను ప్రైమరీ స్కూల్ ఆవరణలోనే ఏర్పాటు చేస్తామని వివరించారు. తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రైమరీ స్కూళ్లలో చేరతారని చెప్పారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల సంఖ్యను గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి ఖాళీలను భర్తీ చేయనున్నారు.