తెలంగాణ క‌రోనా అప్‌డేట్.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

1088 New corona cases reported in Telangana.తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 1:57 PM GMT
తెలంగాణ క‌రోనా అప్‌డేట్.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,19,466 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా 1,088 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. నిన్న ఒక్క రోజే 09 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,607కి పెరిగింది. నిన్న 1,511 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,98,139కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 16,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 137 కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story
Share it