సీఎం రేవంత్‌ సొంత ఇలాకాలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టు

సీఎం రేవంత్‌ రెడ్డి సొంత గ్రామం నాగర్‌ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టుగా సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు కానుంది.

By అంజి  Published on  11 Sep 2024 4:33 AM GMT
solar, TGSPDCL, survey, Telangana, CM Revanth village, Kondareddypalli

సీఎం రేవంత్‌ సొంత ఇలాకాలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టు

సీఎం రేవంత్‌ రెడ్డి సొంత గ్రామం నాగర్‌ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టుగా సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని టీజీఎస్‌పీడీసీఎల్‌ (తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) సీఎండీ వెల్లడించారు. కొండారెడ్డిపల్లిలో సర్వే చేశామని, త్వరలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఉచిత సౌర విద్యుత్‌ పంపుసెట్లు పంపిణీ చేస్తామన్నారు. పైలట్‌ ప్రాజెక్టు సక్సెస్‌ అయితే ప్రతి పల్లెలలో దీనిని అమలు చేయనున్నట్టు తెలిపారు.

దక్షిణాది డిస్కమ్‌ కింద ఒకటి, ఉత్తరాది డిస్కమ్‌ కింద మరో రెండు గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టులు అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సోలార్ ఎనర్జీ కోసం రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉచితంగా సోలార్ పంపుసెట్లను పంపిణీ చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని సౌరశక్తిని ఉత్పత్తి చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రేవంత్ రెడ్డి అధికారులను కోరారు.

గ్యాస్ సిలిండర్లకు బదులుగా సోలార్ స్టవ్‌లను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని, అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా సోలార్ స్టవ్‌ల తయారీకి స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపయోగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Next Story