కోటికి చేరువలో ఉల్లంఘనల కేసులు.. తగ్గని దూకుడు

By అంజి  Published on  17 Feb 2020 5:12 AM GMT
కోటికి చేరువలో ఉల్లంఘనల కేసులు.. తగ్గని దూకుడు

హైదరాబాద్‌: ట్రాఫిక్‌కు సంబంధించి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వాహనదారుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. దీంతో 12 ట్రాపిక్‌ ఉల్లంఘనల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ తరహా ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు కోటికి చేరువయ్యాయి.

2019 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 99,23,900 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 73 శాతం కేసులు హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల నమోదు చేసినవే. హెల్మెట్‌ ధరించకుండా బైక్‌ నడపడం వల్ల రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే గత సంవత్సరం 2,493 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాగా వీటిలో 951 మంది బైక్‌ నడపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యారు. 1,281 మందిలో కొందరు మృతి చెందగా, కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీటిని బట్టి చూస్తే.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం బైక్‌లేనని.

ట్రాఫిక్‌ ఉల్లంఘనల్లో ఒకటైన అధికవేగం కేసులు రెండోస్థానంలో నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65 స్పీడ్‌ లేజర్‌ గన్‌లతో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పరిమితికి మించి వేగంగా వెళ్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మందుబాబులు దారికొస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవింగ్‌ మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. డ్రంకెన్‌ డ్రైవింగ్‌ తనిఖీలను పోలీసులు నిరంత ప్రక్రియగా మార్చడంతో మందుబాబులు దారికొస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

హెల్మెంట్‌ లేకుండా బైక్‌లు నడిపన వారిపై 72,74,713 కేసులు నమోదు అయ్యాయి. 8,25,599 కేసులు అధికవేగం కింద నమోదయ్యాయి. తప్పుడు మార్గంలో వాహనాలు ప్రయాణించినందుకు 5,40,022 కేసులను పోలీసులు నమోదు చేశారు. ట్రిపుల్‌ రైడింగ్‌ కేసులు 3,06,775 కాగా.. సామర్ధ్యానికి మించి ప్రయాణం కింద 2,85,204 కేసులు నమోదు అయ్యాయి.

తప్పుడు నెంబర్‌ ప్లేట్‌ కేసులు: 2,70,895

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు: 99,620

సీట్‌బెల్ట్‌ లేకుండా ప్రయాణం కేసులు: 84,279

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్ కేసులు‌: 83,003

సిగ్నల్‌ జంపింగ్‌ కేసులు: 78,438

పరిమితికి మించి ప్రయాణికులు: 65,016

మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు: 10,336

Next Story