రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌

By సుభాష్
Published on : 12 March 2020 5:38 PM IST

రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల పేర్లను గురువారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేశవరావు, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డిలను టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థులుగా ప్రకటించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్‌రెడ్డిలు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా కొనసాగుతున్న కేశవరావుకు మరోసారి అవకాశం కల్పించారు. ఇక రెండో సీటుపై కూడా సస్పెన్స్‌ వీడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్నిహితుడు దామోదర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సురేష్‌రెడ్డిల మధ్య చివరి వరకు పోటీ నడిచింది. చివరకు సురేష్‌రెడ్డి వైపు కేసీఆర్‌ మొగ్గు చూపారు.

ఈ రెండు స్థానాలకు నామినేషన్లు వేయనున్నారు. నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ మార్చి 13. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు వీరిద్దరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

kk ,suresh reddy

వీడిన ఉత్కంఠ

ఇక తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపిస్తారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రోజురోజుకు తెరపైకి ఆశావాహుల్లో టెన్షన్‌ ఉండేది. చివరకు కేసీఆర్‌ కేకే, సురేష్‌ రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ ప్రకటించారు.

Next Story