మాల్క‌జ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి మరో పవర్ సెంటర్ అన్న ప్రచారంలో ఏమాత్రం తప్పులేదని ఆయ‌న వ్యాఖ్య‌నించారు. మంగళవారం ఆయ‌న మాట్లాడుతూ… కాంగ్రెస్‌లో రేవంత్‌ ఎంత బలపడితే కాంగ్రెస్‌కు అంత బలం అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఎదగాలని అనుకోవడంలో ఎలాంటి త‌ప్పులేద‌న్నారు. రేవంతే కాదు.. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజనర్సింహ ఎవరైనా వ్యక్తిగతంగా ఎదగొచ్చునని వ్యాఖ్య‌నించారు. కాంగ్రెస్‌లో మాత్రం సింగిల్ హీరో ఉండబోరని స్ప‌ష్టం చేశారు. వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఎదిగినా అల్టిమేట్‌గా గాంధీభవనే శాసిస్తుందన్నారు. అలాగే పీసీసీ పదవిపై కూడా జ‌గ్గార‌డ్డి స్పందించారు. వివాద‌స్ప‌దంగా లేని వారే పీసీసీ చీఫ్‌ అవుతారన్నారు. ఆ జాబితాలో శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ఉంటారని అన్నారు. పీసీసీ చీఫ్ నియామకానికి డబ్బుతో సంబంధం ఉండ‌ద‌ని, రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెడతామని చెప్పినా అధిష్టానం పీసీసీ పదవిని కట్టబెట్టదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.