చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ లో తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ నిర్మాణం

By Newsmeter.Network  Published on  13 Dec 2019 8:16 AM GMT
చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ లో తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ నిర్మాణం

హైదరాబాద్ : చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు ముంపు ముంచుకొస్తోంది. ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవి ఇకపై కనుమరుగు అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ కమాండ్ స్కూల్ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తోంది. ఇక్కడే పూర్తి స్థాయి ట్రైనింగ్ సెంటర్లనుకూడా ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నాతాధికారులు భావిస్తున్నారు.

ఇందుకోసం 24 హెక్టార్లను కేటాయించాల్సిందిగా అభ్యర్థిస్తూ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్ విరాన్ మెంట్ అండ్ ఫారెస్ట్స్ కు ఒక లేఖకూడా రాసింది. చిలుకూరు ఫారెస్ట్ ఏరియా లో ప్రభుత్వం అకాడమీ నిర్మాణాన్ని తలపెట్టిన ఈ ప్రదేశంలో ఇంతకుముందే వన్యప్రాణాలను సంరక్షించే మృగావని వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. ఓకవేళ అకాడమీ నిర్మాణం చేపడితే ఇందులో నివసిస్తున్న 600 రకాల మొక్కలు, దాదాపు 350 మచ్చజింకలు, వంద రకాలకు పైగా పక్షులు ఉన్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

అడవిలో సువిశాలమైన భూభాగం ఉన్న కారణంగా భారీ ఎత్తున పోలీస్ పరేడ్ గ్రౌండ్ ని కూడా ఏర్పాటు చేయాలని టి.ఎస్.పి.ఎ భావిస్తోంది. దీనికి సంబంధించిన పర్యావరణ హిత ధృవీకరణ పత్రాలను సర్పించాల్సిందిగా ఎంఓఈఎఫ్ అదేశాలు జారీచేసింది.

హైదరాబాద్ లో ఈ అడాడమీ నిర్మాణం జరిగితే 1,210 మంది కానిస్టేబుళ్లు 523మంది మహిళా పోలుసులను కొత్తగా శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చడానికి ఆస్కారం కలుగుతుందని టి.ఎస్.పి.ఎ అధికారులు చెబుతున్నారు.

పోలుసులకు కమాండో ట్రైనింగ్ తోపాటు, అనేక ప్రత్యేక విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు కొత్తగా అకాడమీ నిర్మాణంజరిగితేనే అనేక విధాలుగా మేలు కలుగుతుందని ఉన్నతస్థాయి అధికారులు అంటున్నారు.

పర్యావరణ వేత్తలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అడవిని పాడుచేయడంవల్ల అరుదైన జంతుజాలాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు. కొందరైతే చిలుకూరు దగ్గరున్న రిజర్వ్ ఫారెస్ట్ కాకుంగా నగరశివార్ల అవతల వీటినన్నింటినీ ఏర్పాటు చేసే ఆలోచన మంచిదంటున్నారు.

Next Story