ముఖ్యాంశాలు

  • వాహనదారులపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైన రవాణాశాఖ
  • గత నాలుగు సంవత్సరాలలో 21,194 మంది లైసెన్స్‌ల రద్దు
  • మరో ఆరు వేల డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేసే యోచనలో అధికారులు

హైదరాబాద్‌: వాహనదారుల నిర్లక్ష్యంపై రవాణాశాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ట్రాఫిక్‌, రవాణా నిబంధనలు, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కొరడా ఝులిపిస్తోంది. మొదట జరిమానాలతో వదిలివాహనదారుల నిర్లక్ష్యంపై రవాణాశాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ట్రాఫిక్‌, రవాణా నిబంధనలు, మద్యం తాగి వాహనాలుపెడుతున్న, తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలలో 21,194 మంది లైసెన్స్‌లను రద్దు చేశారు త్వరలో మరో 6 వేల లైసెన్స్‌ల రద్దుపై రవాణాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. వాహనదారుల లైసెన్స్‌ను రద్దు చేసేందుకు రెండు క్యాటగీరీలుగా విభజించారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు.. ఇలా రెండు క్యాటగిరీలుగా విభజించిన ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కీలక తీర్పుల నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు లైఫ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తున్నట్టు రవాణాశాఖ తెలిపింది.

నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు రవాణాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పట్టుబడితే భారీ జరిమానాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు. ఆల్కహాల్‌ తాగి మూడు సార్లు పట్టుబడటడం, ఓవర్‌ లోడ్‌, సిగ్నల్‌ జంప్‌, పరిమితికి ప్రయాణించడం చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు. తెలంగాణలో 2015 నుంచి 2019 నవంబర్‌ 27 వరకు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని 21,194 మంది లైసెన్స్‌లను రవాణాశాఖ రద్దు చేసింది. పోలీసులు, రవాణాశాఖ తనిఖీల్లో 14,807 లైసెన్స్‌లు రద్దు కాగా, ఇతర కేసుల్లో 5,450 లైసెన్స్‌లు, కోర్టు ఆదేశాలతో 937 లైసెన్స్‌లను అధికారులు రద్దు చేశారు. ఒకసారి లైసెన్స్‌ రద్దు అయిన తర్వాత నిర్దేశిత కాలం నిర్ణయిస్తారు. ఆ కాలం ముగిసిన తర్వాత మళ్లీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాడానికి రవాణాశాఖ అవకాశం కల్పిస్తున్నది. లైసెన్స్‌ సస్పెండ్‌ చేసిన కూడా వాహనం నడుపుతూ పట్టుబడితే మాత్రం జైలు శిక్ష విధించేలా రవాణాశాఖ చర్యలు తీసుకోంటోంది. ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో లైసెన్స్‌ రద్దయిన డ్రైవర్‌, ఒకే వ్యక్తి రెండు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకోకుండా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

పెరుగుతున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌లో 699 మంది మద్యం తాగి పట్టుబడగా వారి లైసెన్స్‌లను చట్ట ప్రకారం రద్దు చేశారు. హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌లో 113, హైదరాబాద్‌ సౌత్‌జోన్‌లో 92, హైదరాబాద్‌ నార్త్‌జోన్‌లో 293, హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌లో 124, రంగారెడ్డి ఆర్టీఏ పరిధిలో 122, పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ పరిధిలో 287, వరంగల్‌ అర్బన్‌లో 183, ఉప్పల్‌లో 111 లైసెన్స్‌లను రద్దు చేశారు. కరీంనగర్‌, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, సూర్యాపేట జహీరాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ అధికంగానే వాహనదారుల లైసెన్స్‌లు రద్దయ్యాయి. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ఓవర్‌లోడ్‌, పరిమితికి ప్రయాణికుల తరలింపు, సిగ్నల్‌ జంప్‌ తదితర 1,490 కేసులు నల్గొండ జిల్లాలో రద్దు చేశారు. ఉప్పల్‌ ఆర్టీఏ పరిధిలో 917 లైసెన్స్‌లను అధికారులు రద్దు చేశారు. మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో 900 నుంచి 700 లైసెన్స్‌లో రద్దయ్యాయి. లైసెన్స్‌ల జారీ, పునరుద్దరణపై నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ఒకసారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దయిన తర్వాత కూడా మళ్లీ అదే వ్యక్తి నిబంధనలను ఉల్లంఘిస్తే పూర్తి స్థాయిలో లైసెన్స్‌ రద్దు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రవాణాశాఖ జేటీసీ రమేశ్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీసీ పాపారావు తెలిపారు.

అంజి గోనె

Next Story