దిశకు మద్దతుగా న్యాయవాదులు..!

By అంజి  Published on  2 Dec 2019 11:17 AM GMT
దిశకు మద్దతుగా న్యాయవాదులు..!

ముఖ్యాంశాలు

  • రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిశ హత్య కేసు
  • నిందితుల తరఫున వాదించకూడదని న్యాయవాదుల నిర్ణయం

రంగారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లేడి డాక్టర్ హత్య కేసు నిందితుల తరుపున ఏ న్యాయవాది కూడా న్యాయ సహాయం చేయకూడదని షాద్ నగర్ న్యాయవాదులు తీర్మానం చేసారు. ఈ మేరకు నిందితులను చట్ట బద్దంగా కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేసారు. షాద్ నగర్ కోర్ట్ ప్రాంగణంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు ప్రజలు పాల్గొని ఇటువంటి దారుణాలు ఇకముందు జరగకుండా చట్టాలను మరింత పటిష్టం చేయాలనీ తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేసారు. స్త్రీలపై జరుగుతున్న అఘయిత్యాలు ఇకనైనా తగ్గాలని.. స్త్రీలను గౌరవించే దిశగా యువత ముందుకు సాగాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Next Story
Share it