ముఖ్యాంశాలు

  • ఎల్‌బీనగర్‌ పీఎస్‌ పరిధిలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిడ్నాప్‌ కలకలం
  • రియల్ ఎస్టేట్ వ్యాపారిని వెంబడించిన దుండగులు
  • దుండగుల నుంచి తప్పించుకున్న వ్యాపారి యాదగిరిరెడ్డి

హైదరాబాద్‌: ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిడ్నాప్‌ స్థానికంగా కలకలం రేపింది. యాదగిరి రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి యాదగిరిరెడ్డి ఇంటి నుంచి బయటకు రాగానే.. కాలనీ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో రెండు కార్లలో ఉన్న కొందరు కిడ్నాపర్లు యాదగిరిరెడ్డిపై దౌర్జన్యం చేసి లాకెళ్లబోయారు. యాదగిరి రెడ్డి ప్రతిఘటిస్తూ అరవడంతో అటూ వైపు కొందరు స్థానికులు వచ్చారు. వెంటనే దుండగులు సెల్‌ఫోన్‌, కారు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల నుంచి తప్పించుకున్న యాదగిరిరెడ్డి కాలనీలో పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడు ఎల్బీనగర్‌లో పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. మా వెనకాల కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ ఉన్నాడంటూ దుండగులు బెదిరించారని.. పోలీసులకు వ్యాపారి యాదగిరిరెడ్డి తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story