మదనపల్లి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా..!

By అంజి  Published on  3 Dec 2019 4:47 AM GMT
మదనపల్లి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా..!

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌ మండలంలోని మదనపల్లి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి జరిగింది. బస్సు హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతరంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌ మండలంలోని మదనపల్లి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు అదుపు గాత్రులను దగ్గరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బస్సును తొలగించేందుకు తీసుకువచ్చిన క్రేన్‌ కూడా బోల్తా పడింది. దీంతో మరో క్రేన్‌ను తీసుకొచ్చి బస్సును తొలగించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ ప్రమాదనికి మితిమీరిన వేగం, వర్షం పడడమే కారణమనా స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు మేడ్చల్‌ జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద మరో ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున ఓ కారు అతివేగం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కారు నెంబర్‌ AP09CS1613. ఒకరికి తీవ్రగాయాలు కాగా నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Next Story
Share it