తెలంగాణ పురపోరుకు సై..!
By Newsmeter.Network
ముఖ్యాంశాలు
- 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్‌లు
- మోగిన తెలంగాణ పురపాలక ఎన్నికల నగరా
తెలంగాణ పురపాలక ఎన్నికలకు కసరత్తు మొదైలంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జవనరి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 30న ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 31న అధికారులు, రాజకీయ పార్టీలు సమావేశం కానున్నాయి. జనవరి 1న మున్సిపల్ కమిషన్‌ర్లతో ఎలక్షన్ కమీషనర్ సమావేశం కానున్నారు. ఆత్వాత జనవరి 4న ఓటర్ల తుది జాబితా వెలువడుతుంది. జనవరి 8న ఆయా ప్రాంతాల్లో అధికారులు రిటర్నింగ్ ఎలక్షన్ నోటీస్ ఇవ్వనున్నారు. జనవరి 10న నామినేషన్ల గడువు ముగుస్తుంది. జనవరి 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ప్రకటించారు. జనవరి 22న పోలింగ్ జరగనుంది. అనంతరం జనవరి 25న ఓట్లను లెక్కించనున్నారు.