మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
By అంజి Published on 24 Nov 2019 10:48 AM IST
జనగామ: రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన శనివారం అర్థరాత్రి లింగాలఘనపురం మండలం చీటూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మంత్రి కారు వెనుక వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి పాలకుర్తికి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ పార్థసారథి (30), సోషల్ మీడియా ఇంచార్జి (27)లు మృతి చెందారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు గన్‌మెన్ నరేశ్, అటెండర్ తాతారావు, పీఏ శివలను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి దయాకర్‌రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
Next Story