డ్రోన్ల విషయంలో దేశంలోనే తొలి సారిగా ఒక నిర్దిష్టమైన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే టీ ఆర్ అన్నారు. దీని వల్ల డ్రోన్లు, మానవ రహిత విమానాల పరిశ్రమకు ఊతం లభిస్తుందని ఆయన అన్నారు. ఆరోగ్య సేవలు, వ్యవసాయం, గనులు తవ్వకాలు, శాంతి భద్రతలు తదితల వ్యవహరాల కోసం డ్రోన్లను వాడే విషయంలో వివిధ స్టార్టప్ లు, పరిశ్రమలను భాగస్వాములుగా చేసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన అన్నారు.

అపోలో ఆస్పత్రులతో ఒక ఒప్పందం చేసుకుని డ్రోన్ల ద్వారా మందులను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో సత్వరమే అనుమతులను ఇచ్చినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వంలోని పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు తెలియచేశారు. డ్రోన్లపై పరిశోధనలు చేసేందుకు, నైపుణ్యాల వికాసానికి, వాణిజ్యీకరణకోసం ఒక డ్రోన్ సిటీని అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

also read :  స్కూళ్లు, థియేటర్లు బంద్‌ అయ్యే అవకాశం..?

తెలంగాణ వైమానిక రంగంలో గత అయిదేళ్లలో చాలా ప్రగతిని సాధించిందని, తెలంగాణ దేశంలోనే ఎరో స్పేస్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రదేశంగా అభివృద్ధి చెందిందని,  పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తాక్ హీడ్ మార్టిన్, సికోర్స్ కీ, బోయింగ్, జీ ఈ , సాఫ్రాన్, రఫేల్ , ఎల్బిట్ వంటి సుప్రసిద్ధ కంపెనీలు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని, ఇప్పటికే నాదర్ గుల్ ఏరోస్పేస్ పార్ట్, జీ ఎం ఆర్ ఏరో స్పేస్, ఆదిభట్ల ఏరో సెజ్, అదానీ ఏరోస్పేస్ పార్క్, హార్డ్ వేర్ పార్క్ … ఇలా అయిదు ఏరో స్పేస్ సెజ్ లు తెలంగాణలో ఉన్నాయని, దేశంలోనే తెలంగాణ ఈ రంగంలో ముందంజలో ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే 25 కు పైగా కంపెనీలు ఇక్కడ రావడానికి ఆసక్తి చూపుతున్నాయని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ ఉషా పాథీ భారతదేశం విమానయాన రంగానికి కేంద్రబిందువుగా నిలుస్తోందని, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటు, వైమానిక టూరిజం కల్పన రంగాలలో చాలా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో 21 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు ప్రారంభం కానున్నాయని ఆమె తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.