పాలన వ్యవస్థలో భారీ కుదుపు.. ఒక్కసారిగా 50 మంది ఐఏఎస్‌ల..

By అంజి  Published on  3 Feb 2020 9:26 AM IST
పాలన వ్యవస్థలో భారీ కుదుపు.. ఒక్కసారిగా 50 మంది ఐఏఎస్‌ల..

తెలంగాణ ప్రభుత్వం తమ పరిపాలనో భారీ ప్రక్షాళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐఏఎస్‌ బదిలీలు జరిగాయి. రాష్ట్రంలోని 31 జిల్లాలు ఉండగా వాటిలో 20 చోట్ల కొత్త కలెక్టర్లకు పోస్టింగులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐఏఎస్‌లను ఈ స్థాయిలో బదిలీ చేయడం ఇదే తొలిసారి. 16 మంది ఐఏస్‌లకు సబ్‌ కలెక్టర్‌ పోస్టింగ్‌లు కల్పించారు. కాగా జిల్లా కలెక్టర్లతో సహా అన్ని స్థాయిల్లోని 39 మంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్థాన చనలం చేసింది. పలువురు సీనియర్‌ ఐఏస్‌లను కూడా బదిలీ చేసింది.

ఈ బదిలీల్లో మంత్రి కేటీఆర్‌ ముద్ర సుస్పష్టంగా ఉందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎన్నికలు ముగియడంతో పూర్తి దృష్టి పాలనపైనే కేంద్రీకరించాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాయింట్‌ కలెక్టర్‌ నుంచి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వరకు 50 మందిని బదిలీ చేస్తూ పాలన వ్యవస్థను ఒక కుదుపు కుదిపింది. కాగా చాలా మందిని గతంలో నియమించిన శాఖలకే బదిలీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఇటీవలే సీఎం కేసీఆర్‌ నియమించారు.

ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా పార్థసారథి, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌, వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి, పశుసవంర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదర్‌సిన్హా, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియా, నీటిపారుదల ముఖ్యకార్యదర్శిగా రజత్‌కుమార్‌, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా వికాస్‌రాజ్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా, విపత్తు నిర్వహణ ముఖ్యకార్యదర్శిగా జగదీశ్వర్‌ నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా అబ్దుల్‌ అజీమ్‌, జగిత్యాల కలెక్టర్‌గా శరత్‌, వికారాబాద్‌ కలెక్టర్‌గా పౌసుబీ బసు, కొత్తగూడెం కలెక్టర్‌గా ఎంవీ రెడ్డి, నారాయణపేట కలెక్టర్‌గా హరిచందన, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా దేవసేన బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ కలెక్టర్గ్ఆ శ్వేతా మహంతి, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు, ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌, నిజామాబాద్‌ కలెక్టర్‌గా ముషారఫ్‌ అలీ, వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా హనుమంతు, ములుగు కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావు బదిలీ అయ్యారు.

Next Story