Telangana Formation Day: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

By అంజి  Published on  1 Jun 2023 9:00 AM IST
Traffic restrictions, Hyderabad, Telangana Independence Day

Telangana Formation Day: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను బట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. అలాగే రేపు ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. వీవీ విగ్రహం - నెక్లెస్ రోటరీ - ఎన్టీఆర్‌ మార్గ్ - తెలుగు తల్లి జంక్షన్ మధ్య ట్రాఫిక్ అనుమతించబడదు. ఖైరతాబాద్ / పంజాగుట్ట / సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లాలనుకున్న ట్రాఫిక్ షాదన్-నిరంకారి వైపు మళ్లించబడుతుంది.

ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి సాదన్‌ కాలేజీ వైపు మళ్లిస్తారు. వీవీఐపీ రాకపోకల సందర్భంగా సాదన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపుతారు. ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మళ్లిస్తారు. అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్టమైసమ్మ జంక్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు. అఫ్టల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా వెళ్తాయి.

ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. బడాగణేశ్‌ లేన్‌ వైపు నుంచి ఐమాక్స్‌, నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కంపౌండ్‌ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్‌ లేన్‌లోకి మళ్లిస్తారు. మింట్‌లేన్‌ నుంచి బడాగణేశ్‌ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు.

Next Story