గిరిజన హాస్టల్‌లో 67 మంది బాలికలకు ఫుడ్‌పాయిజన్‌.. ఎక్కడంటే..?

By అంజి  Published on  24 Nov 2019 8:25 AM GMT
గిరిజన హాస్టల్‌లో 67 మంది బాలికలకు ఫుడ్‌పాయిజన్‌.. ఎక్కడంటే..?

ముఖ్యాంశాలు

  • 67 మంది విద్యార్థినిలకు అస్వస్థత
  • రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులు
  • నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థులకు చికిత్స

నిజామాబాద్‌: నగరశివారులోని నాగరం గిరిజన ఆశ్రమ వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ జరిగింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత 67 మంది విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులు భోజనంతో పాటు పాయసం, పకోడి తిన్నారు. దీంతో రాత్రి సమయంలో 20 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గిరిజన వసతి గృహం సిబ్బంది హుటాహుటిన వారిని నిజామాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. క్రమక్రమంగా ఆదివారం ఉదయం వరకు అస్వస్థతకు లోనైన విద్యార్థుల సంఖ్య 62కు చేరుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి చెరుకోని తమ పిల్లల ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. వసతి గృహం సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థినిల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని తల్లిదండ్రులు అధికారులను కోరారు.

చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ రామోహన్ రావు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్‌ సూచించారు. అలాగే వీలైనంత తొందరగా డిశ్చార్జీ అయ్యేలా చూడాలన్నారు. నాగారం ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కలెక్టర్‌ రామోహన్ రావు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎవరి పొరపాటు బయటపడినా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థినిలను ఇవాళ సాయంత్రం వరకు డిశ్చార్జ్‌ చేస్తామని ఆస్పత్రికి సిబ్బంది వెల్లండించారు.

Next Story