ఆ జాబితాలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి.!
By అంజి Published on 8 April 2020 3:28 AM GMTహైదరాబాద్: భారతదేశంలోనే మంచి పనితీరు గల టాప్ 25 ఐపీఎస్ అధికారులలో ఒకరిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పీఎస్‌యూ వాచ్, ఆసియా పోస్ట్‌లు భారతదేశంలోని 4000 మంది ఐపీఎస్ అధికారుల పనితీరును సర్వే చేశాయి. అందులో మంచి ప్రతిభ కనబర్చిన 200 మంది ఐపీఎస్ అధికారుల ఎన్నుకుంది. అందులో ఏజెన్సీ, మీడియా నివేదికల యొక్క అంతర్గత నివేదికల ఆధారంగా, సంస్థ దానిని టాప్ 25 అధికారులకు జెల్ చేసింది. నక్సలిజం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల, మానవ అక్రమ రవాణా వంటి అంతర్జాతీయ నేరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. నేరాలను నియంత్రించే వారి సామర్థ్యం, నిజాయితీ, శాంతి భద్రతలను మెరుగుపరిచే సామర్థ్యం, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామని పీఎస్‌యూ వాచ్ సంస్థ సంచాలకుడు వివేక్ శుక్లా ఓ ప్రకటనలో అన్నారు. బిహార్, జమ్ముకశ్మీర్, పంజాబ్, చంఢీఘడ్, కేరళ రాష్ట్రాల డీజీపీలకు ఈ లిస్ట్‌లో చోటు దక్కింది.
1984 బ్యాచ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అర్వింద్ కుమార్, రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ చీఫ్ సమత్ కుమార్ గోయల్, ఇండో టిబెటన్ బోర్డర్ డీజీ ఎస్‌ఎస్ దేశ్వాల్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి 8వ స్థానంలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి 1986 ఐపీఎస్ బ్యాచ్. 2017, నవంబర్ 12న తెలంగాణ డీజీపీగా మహేందర్‌రెడ్డి నియామకమయ్యారు. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి పని చేశారు. టాప్ 25 ఐపీఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైనందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలుపుతున్నారు. మంత్రులు, ఐపీఎస్ అధికారుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.