ఏప్రిల్ 22 కల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి ఈటెల

By రాణి  Published on  9 April 2020 3:07 PM GMT
ఏప్రిల్ 22 కల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి ఈటెల

తెలంగాణలో మొత్తం 471 కరోనా కేసులు నమోదవ్వగా ప్రస్తుతం 414 మందికి గాంధీలో చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటి వరకూ 45 మంది కరోనా నుంచి కోలుకోగా గురువారం మరొకరు కరోనాతో మరణించడంతో మృతుల సంఖ్య 12కు చేరినట్లు తెలిపారు. తాజాగా 665 మందికి కరోనా టెస్టులు చేయగా 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఆ 18 మందితో కాంటాక్ట్ ఉన్నవారిని క్వారంటైన్ కు పంపించామన్నారు. శుక్రవారం సుమారు 70 మంది గాంధీ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు చెప్పారు.

Also Read : సినీ కార్మికుల ఇళ్లకే నిత్యావసరాలు

రాష్ట్ర వ్యాప్తంగా 101 హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించామని, వాటిలో హైదరాబాద్ లోనే 15 హాట్ స్పాట్లున్నాయని తెలిపారు. హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావసరాలకు కూడా ఎవరూ బయటికి రాకూడదని సూచించారు. నిత్యావసరాలను నేరుగా ఇళ్లకే పంపుతామన్నారు. అలాగే హాట్ స్పాట్ ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి ఇంటింటి సర్వే నిర్వహిస్తారని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కేవలం లాక్ డౌన్ వల్లే కరోనా తగ్గుముఖం పడుతోందన్నారు. లాక్ డౌన్ ను ఇలాగే కొనసాగిస్తే ఏప్రిల్ 22వ తేదీకల్లా తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా బయటపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మర్కజ్ ఘటనతోనే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయన్నారు. యాక్టివ్ గా ఉన్న 414 కేసుల్లో 388 కేసులు ఢిల్లీ లింక్ వే నteని మంత్రి ఈటల స్పష్టం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు ప్రభుత్వానికి సహకరించి జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటామన్నారు.

Also Read : సింగరేణి కార్మికుడికి కరోనా..విధుల్లో ఉన్నవారంతా క్వారంటైన్

Next Story